Wednesday, August 26, 2009

తను ఆనాడు.మరి ఈనాడు

ఆకాసంలో నక్షత్రంలా
సూర్యకాంతిలోని కిరనంలా
సంద్రంలో కలిసిన నదిలా
సెలయేటిలోని చేపపిల్లలా
పూవనంలో గండుతుమ్మేదలా
జలపాతంలో గాలిచినుకులా
ఇంద్రధనుసులో నీలిరంగులా
జాజితోటలో పిల్లగాలిలా
తామరపై నీటిబిందువులా
నిండువేన్నెలలో సన్నజాజిలా
నింగికెగసిన పక్షిపిల్లలా
నీలిమేఘాల నిండుమబ్బులా
నీలివర్నాల నింగిమేరుపులా
ఇంద్రధనుసుల రంగవల్లిలా...

అలా...ఇలా...అంటూ ఒకనాడు వర్ణించిన నీవు

నీ నేలను తాకిన స్వాతిచినుకును నేనన్నావు
నీజీవితగమనానికి తీరం నేనన్నావు

నీ మధుర దరహాస కావ్యగీతికను నేనన్నావు
నీ గమ్యానికి త్రోవను నేనన్నావు

నీ చిలిపి సరదాల వరదలకు పరదా నేనన్నావు
నీ ఆనందాలకు అర్ధం నేనన్నావు

నీ మాటలమంత్రపు మర్మం నేనన్నావు
నీ బ్రతుకుబాటకు బాసట నేనన్నావు

నీ ఆశల అంతరంగానికి ఆలంబన నేనన్నావు
నీ వలపు కెరటాల కిన్నెర నేనన్నావు

నీ హృదయవీనను మ్రోగించే రాగాన్ని నేనన్నావు
నీ శ్వాసను నిలిపే ఊపిరి నేనన్నావు

నీ ఊహల ఊయల డోలిక నేనన్నావు
నీ ఊసుల మాలిక నేనన్నావు

నీ కలతలరేయికి ఉషోదయాన్ని నేనన్నావు
నీ కలల వాకిట వెన్నెల నేనన్నావు

నీ బ్రతుకుపుస్తకంలో క్షరం కాని అక్షరం నేనన్నావు
నీ తలపుల వర్షపు చిరుజల్లు నేనన్నావు

నీ యెదలోతుల ఒదిగిన బృందావని నేనన్నావు
నీ కనుతేరలమాటున తీరని ఆశను నేనన్నావు

మరి ఈనాడేమో................

ఆ స్వాతిచినుకు కన్నీటి చెమ్మగా మారింది
ఆ తీరానికి దరి లేదంది
ఆ కావ్యగీతికకి అర్ధం లేకుంది
ఆ త్రోవకి గమ్యం కరువయ్యింది
ఆ పరదాకీ సరదా కనుమరుగయ్యింది
ఆ ఆలంబనకి ప్రతిబింబం మాయమయ్యింది
ఆ కిన్నేరకికన్నేర్రబడింది
ఆ రాగం మూగబోయింది
ఆ ఊపిరి నిలిచిపోయింది
ఆ డోలిక అంతర్దానమయ్యింది
ఆ ఊసుల మాలిక వాడిపోయింది
ఆ ఉషోదయం నిశీదిగా మిగిలింది
ఆ వెన్నెల వన్నెలు పోగొట్టుకుంది
ఆ అక్షరం క్షరమయ్యింది
ఆ వర్షపు చిరుజల్లు పెనుతుఫానుగా ప్రబలింది
ఆ బృందావనిలో ఆనందం ఆవిరయ్యింది
ఆ ఆశ అంతరించిపోయింది

కారణమేదైనా , కర్తలు ఎవరైనా కర్మను అనుభవించేది నా కన్నీరేగా

కాలం కారుమేఘంలా కమ్ముకుంటున్నా, నా ఈ కన్నీటికి మాత్రం క్షణం తీరికలేదు మరి!

అందుకే..........
ఆ కన్నీటి కెరటాన్ని తీరం చేర్చాలని,
అక్షరానికి దగ్గరయ్యా, ఏకాంతాన అక్షరకాంతినయ్యా !!!

Friday, August 21, 2009

తనేతీరు?........


ఓనాడు మల్లెతీగలా ,మరోనాడు గులాబీలా వుండాలని అనుకుంటాడేమో తను,
ఎందుకంటే,
వదలమనేకొద్దీ అల్లుకుపోవడం కొన్నాళ్ళ వొంతైతే
అందంగా కనిపిస్తూ ,ఆసక్తిగా చూడాలనిపిస్తూ
చెంత చీరదీసే సమయాన ప్రొద్దుతిరుగుడు పూవల్లె
తన అస్తిత్వాన్ని మార్చుకుంటాడు
మరి నాకేమో .........
గమ్యాలని తనలోనే వెతుక్కోమనే అర్ధంకాని మనోపుస్తకమే అతడు.