Tuesday, October 26, 2010

కాకినైన కోకిలను....

గతం గతం, అనుకుంటూ గమ్యమెరుగని తీరాలకు పయనిస్తున్న ఓ బాటసారిని.
అనుభవాల నీడలు ఎండమావులై నన్ను పరిహసిస్తోంటే....
అలుపెరగక ... తనువు మరిచి, మనసు తెరిచి, కలని తెలిసి, ఇలని మరచి నింగికెగసిన నా అమాయకత్వం
మనసు తరచి, వలపు వెరచి, నువు రావని తెలిసి, కన్నీరై కరిగి, ఆత్మన్యూనత పెరిగి,
కోకిలని తేలిసినా కాకిలా బ్రతుకుతున్న...కలిమి చెడిన కారుమేఘాన్నిచేసింది.

No comments:

Post a Comment