Sunday, April 18, 2010

ఎందుకీ మౌనం...???

నేస్తం..ఏమిటీ మౌనం....???
నీ మాటల జలధారలకు ఆనకట్టలే లేవనుకున్న నువ్వేనా మౌనం వహించింది...??
నీ చిలిపి అల్లర్లతో చీకటిని సైతం అరచేత్తో అడ్డుకున్న నువ్వేనా మౌనం వహించింది...??
నీ మెరుపులాంటి ఆలోచనలతో పరులని విస్మయంలో ముంచే నువ్వేనా మౌనం వహించింది...??
నీ అతిసహజమైన సాంగత్యంతో అందర్నీ మైమరపించే నువ్వేనా మౌనం వహించింది...??

నా కంటిపాప కదలికను సైతం అర్ధం చేసుకోగల నీ కళ్ళు ,
ఈనాడు నా కంటి ఘోషను ఎందుకు అర్ధం చేసుకోలేదు...??

నాలో లవలీసమైన మార్పును కూడా వెంటనే పసిగట్టే నీవు ,
ఈ మానసిక పెనుతుఫానులో నేను కొట్టుకుపోతుంటే ఆలా చూస్తూండిపోయావే...??

నాకు ఏ కష్టం కలగకూడదనుకుని నువ్వే నాబాధలన్నిటినీ ఎత్తుకున్నావే ,
మరి నన్నీ అస్పష్టమైన పరిస్తితిలో ఎందుకొదిలేసావ్...??

నీ కళ్ళు నాకళ్ళని ఎందుకు తప్పించుకుంటున్నాయ్...??
నీ మాట నా మాటలు ఎందుకు అర్ధం కావంటున్నాయ్...??
నీ సమక్షం నాకెందుకింత బరువుగా గడుస్తోంది...??
నీ మనసు నాకెందుకు ప్రశ్నార్ధకంగా మారింది...??

నేస్తం నీ కళ్ళే నాచాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి.
కానీ...ఆ కళ్ళే...ఇలా మౌనం వహిస్తే.......
ఇంకా నేనెవరిని అడగాలి...ఎవరికోసం ఎదురు చూడాలి...??

పోనీలే...నేస్తం...
ఏదో ఓ రోజు..ఈ భావోద్వేగాన్ని తట్టుకోలేక
నా మనసు మూగదై నేను శాశ్వతంగా మౌనం వహించిన వేళ....
హు.....అప్పుడైనా...
నీ కళ్ళు నాకోసం చమరిస్తే చూడాలని....
నా కళ్ళను తెరిచే శాశ్వత నిద్రలోకి జారుకుంటానని....మరువకు నేస్తం...

నా కళ్ళు నాక్కావలసిన సమాధానం కోసం
ఎప్పటికీ నీ కళ్ళని వెతుకుతూనే ఉంటాయని...
...మరి గుర్తుంచుకో నేస్తం...

2 comments:

  1. చాలా బాగుందండి...ఇది చదివితే నాకు నేను రాసుకున్న ఒక చిన్న కవిత గుర్తుకొచ్చింది...మీ భావాలు బాగున్నాయి..


    నా కంటి చూపూ తాకితేనే కరిగిపోతావా...?
    కనిపించకుండా కనుమరుగై పోతున్నావు..
    నాతో మాట్లాడితే నీ మనసు మలినమై పోతుందా...?
    మనసారా మాట్లాడిస్తే మౌనంగా వెళ్ళిపోతున్నావు...

    ReplyDelete
  2. chaala baagundande...extend chestee..inkaa baguntundi..

    ReplyDelete